ETV Bharat / state

అమ్మకు ఇచ్చిన మాట కోసం.. అందరికీ అమ్మయ్యాడు..! - narasannapeta

ప్రతి ఒక్కరి జీవితంలో చివరి అంకం వృద్ధాప్యం. ఈ వయస్సులో పిల్లల ప్రేమానురాగాలకు దూరమైన వారు కొందరైతే.... అనారోగ్యం వల్ల అలసిపోయిన వారు మరికొందరు. ఏతోడూ నీడ లేక తల్లడిల్లుతున్న ఇలాంటి వారిని అక్కున చేర్చుకుంటున్నాడో మనసున్న మనిషి . తన తల్లి కోర్కెను నెరవేర్చేందుకు నిరంతరం వృద్ధుల సేవలో తరిస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసిపై ప్రత్యేక కథనం.

srikakulam-nagraj-founded-the-old-age-home-to-fulfill-his-mothers-wish
అమ్మ మాట కోసం అందరికీ అమ్మయ్యాడు..!
author img

By

Published : Jan 1, 2022, 2:54 PM IST

Updated : Jan 1, 2022, 5:21 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ఈయన పేరు గు‌డ్ల నాగరాజు. గొట్టిపల్లిలో 4 ఎకరాల విస్తీర్ణంలో పదిహేనేళ్లుగా తపోవనం వృద్ధాశ్రమాన్ని ఎంతో శ్రద్ధగా నడుపుతున్నారు. ఏ దిక్కూ లేని వృద్ధులను చేరదీసి.. వారికి అన్నీ సమకూర్చుతున్నారు. తన తల్లి కోరిక మేరకు 2005లో తపోవనం పేరిట వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. తొలుత 15 మందితో మొదలైన ఈ ఆశ్రమంలో.. క్రమంగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇక్కడ 35మందికి సరిపడా అన్ని రకాల వసతులు ఉన్నాయి. ప్రస్తుతం ఆశ్రమంలో 22 మంది వృద్ధులున్నారు. ఎవరైనా మరణిస్తే అన్నీ తానై అంతిమ సంస్కారాలు చేస్తున్నారు.

అమ్మ మాట కోసం అందరికీ అమ్మయ్యాడు..!

మా అమ్మగారి కోరిక మేరకు నాలుగెకరాల స్థలంలో నిర్మాణం చేశాను. ఇప్పుడు ఆశ్రమంలో 22 మంది ఉన్నారు. అందరూ 70 సంవత్సరాలు దాటిన వృద్ధులే. మేమైతే పిల్లలులేని అనాథ వృద్ధులను జాయిన్ చేస్కోవడం అనే కాన్సెప్ట్ తో ఈ ఆశ్రమం పెట్టాం. కొడుకు పెంచలేని పరిస్థితిలో ఉండే తల్లిదండ్రులను కూడా జాయిన్ చేస్కుంటాం.
- గు‌డ్ల నాగరాజు, వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు

ఆశ్రమంలో ప్రశాంత వాతావరణం ఉండేలా నాగరాజు జాగ్రత్తలు తీసుకున్నారు. వృద్ధుల విశ్రాంతికి, కాలక్షేపానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవుని సేవలో తరించేందుకు శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో కొలను సైతం తవ్వించారు. తపోవనంలోని వృద్ధులందరికీ సరిపడా పాలు, పెరుగు కోసం గోశాల నెలకొల్పారు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి వైద్యుడు వచ్చి అందరికీ పరీక్షలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ ఎవరి పరిస్థితైనా విషమిస్తే.. పెద్దాసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు.

  • గత ఎనిమిదిన్నర సంవత్సరాలు నేనిక్కడే ఉంటున్నాను. చాలా బాగా చూస్తున్నారు అందరూ. ఆయన పేదల పాలిట పెన్నిధి. ఆయనే మా దేవుడు కూడాను. వృద్ధాశ్రమం మాత్రం చాలా నిజాయితీగా నడుపుతున్నారు. నేను చాలా హాయిగా ఇక్కడ ఉంటున్నాను.
  • నేను వృద్ధాశ్రమానికి వచ్చి ఆరు సంవత్సరాలైంది. నాకిక్కడే ఎలాంటి లోటూ లేదు. నన్ను సక్కగా సూస్కుంటున్నరు.
  • నేను ఆశ్రమంకు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నా భర్త పోయారు. ఎవరూ నన్నాదరించలేదు. నాగరాజు బాబు నన్ను కొడుకు లాగా చూస్కుంటున్నాడు. ఏ లోటూ లేదు. నాకు అన్ని జబ్బులూ ఉన్నాయి. వాటన్నిటికి ఆయనే మందులిచ్చి నన్ను ఆదరిస్తున్నారు. ఓ తల్లిలాగా, తండ్రిలాగా, కొడుకులాగా... మాకన్నీ తానే అయ్యి ఆదరిస్తున్నాడు.
  • నాకెవరూ లేరు. పిల్లలు కూడా లేరు. ఊళ్లో ఉండేందుకు చోటు దొరకలేదు. ప్రెసిడెంటు గారిని బతిమాలితే.. ఆ నాయనొచ్చి ఈయనకు అప్పజెప్పి వెళ్లాడు.
  • కొడుకు రాలేడు. నాకిప్పుడు ఏ లోటూ లేదు. నాగరాజు బాబే నన్ను చూస్కుంటున్నాడు. నాకు ఒక్కరోజు కూడా ఆశ్రమాన్ని వదిలి వెళ్లబుద్దేయదు. కానీ నా కూతురు సూస్తా అంటే... నాగరాజు బాబు నన్ను పంపాడు. బాబు నాకిప్పడివరకు లోటు లేకుండా బట్టలన్నీ ఇచ్చాడు. బాగా సూస్కుంతున్నారు. నాగరాజు బాబే నా కొడుకు.
    - వృధ్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు

ఇక్కడ తమ ఇంటి కంటే ఎంతో ప్రశాంతంగా ఉందని వృద్ధులు అంటున్నారు. ఇదే తమ దేవాలయం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాశ్రమం నిర్వహణకు తొలుత ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నానంటున్న నాగరాజు... దైవ సంకల్పంతో వాటన్నింటినీ అధిగమించానని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో... ఇకపైనా ఈ మహాసంకల్పాన్ని కొనసాగిస్తానని అంటున్నారు.

ఇదీ చూడండి:

Water Problems: ప్రభుత్వాలు మారుతున్నా.. బుక్కెడు నీళ్లు రావట్లే!

Last Updated : Jan 1, 2022, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.