శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ విజయసునీత స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం కోనుగోలుకు సంబంధించి నిర్వహించిన డయల్ యువర్ జాయింట్ కలెక్టర్ కార్యక్రమంలో.. రైతుల సమస్యలకు.. పరిష్కార మార్గాలను చెప్పారు. జవాద్ తుపానులో దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని సూచించిన జేసీ.. రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని ఆన్నదాతలను కోరారు.
ఇదీ చదవండి: