పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని కార్గిల్ ప్రాంతం వద్ద... పాకిస్థాన్‌కు చెందిన బాంబులు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో శ్రీకాకుళానికి చెందిన జవాను వీరమరణం పొందారు. హడ్కో కాలనీకి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు.. బాంబ్ స్క్వాడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా భారత భూభాగంలో ఉన్న.. పాకిస్థాన్‌కు చెందిన బాంబులను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తూ బాంబ్ పేలటంతో ఉమామహేశ్వరరావు అక్కడికక్కడే మరణించారు. ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా... ఆయన పార్థీవ దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సైనిక లాంఛనాలతో అమరవీరుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఉమామహేశ్వరరావు అంత్యక్రియల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ రక్షణకై విధులు నిర్వర్తిస్తూ అమరుడైన వీర జవాన్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ రాలేదనీ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి