శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామానికి చెందిన బత్సల శంకరరావు(38) సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇతడు గతేడాది మార్చిలో ఉపాధి కోసం 17మంది కూలీలతో కలసి వెల్డింగ్ పనులకు.. సౌదీలోని సీజర్ గ్రూప్ సంస్థలో చేరాడు. లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక తీవ్రఇబ్బందులు పడుతూ... అనారోగ్యంతో చనిపోయాడని తోటి కూలీలు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం మృతిపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తమకు చివరిచూపైనా దక్కేలా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: 940 కేజీల గంజాయి పట్టివేత