ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్​ జయంతి వేడుకలు

శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

srikakulam district tdp leaders and nandamuri fans celebrated ntr 97th birth anniversary
శ్రీకాకుళం
author img

By

Published : May 28, 2020, 5:50 PM IST

ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలను నరసన్నపేటలో ఘనంగా నిర్వహించారు. క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని నరసన్నపేట మాజీఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ముందుగా పార్టీ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 38 సార్లు కరతాళ ధ్వనులతో సంఘీభావం తెలిపారు.

srikakulam district tdp leaders and nandamuri fans celebrated ntr 97th birth anniversary
నరసన్నపేట

తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా నేత కింజారాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, తెదేపా జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి పూలమాలలు వేశారు.

srikakulam district tdp leaders and nandamuri fans celebrated ntr 97th birth anniversary
శ్రీకాకుళం

ఆమదాలవలస పురపాలక సంఘం పారిశ్రామికవాడ వద్ద ఉన్న త్రికోణ పార్కులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి కూన రవికుమార్ నివాళులర్పించారు. నందమూరి తారకరామారావు రాష్ట్రానికి చేసిన సేవ మరువలేమని ఆయన గుర్తుచేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్​కే దక్కుతుందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ప్రతి ఒక్కరు నెరవేర్చాలని కోరారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఆమదాలవలస

ఇదీ చదవండి :

జిల్లాలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.