అతడి పేరు సవర రమేష్.. ఒడిశాకు చెందిన వ్యక్తి. తేలిగ్గా మహిళలను చంపేస్తాడు. ముందుగా మహిళలతో పరిచయాలు పెంచుకుంటాడు... ఆ తర్వాత కోరిక తీర్చమంటాడు. తీరిస్తే...సరేసరి... లేదంటే అతడి చేతిలో బలికావాల్సిందే!. అలా... 2016 నుంచి ఇప్పటివరకు ముగ్గురు మహిళలను హతమార్చాడు. చివరకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీసుల చేతికి చిక్కాడు. ఈ కేసును ఛేదించిన పాతపట్నం పోలీసులకు ఎస్పీ అమ్మిరెడ్డి నగదు బహుమతిని అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ వివరించారు.
ఇదీ చూడండి: సర్వేయర్‌పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..?