గుజరాత్లోని వీరావల్ లో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేశానికి చెందిన 28 ఏళ్ల మగుపల్లి కోయరాజు మృతి చెందిన వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈయనకు భార్యతో పాటు రెండు నెలల కుమార్తె ఉంది. జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎనిమిది నెలల క్రితం చేపలవేటకు వీరావల్ వెళ్లారు.
లాక్డౌన్తో గత కొద్దిరోజులుగా జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. ఫలితం లేకపోయింది. జగన్నాధం అనే మరో వ్యక్తి ఈనెల 7వ తేదీ వీరావలిలో మృతి చెందాడు. ఇలా ఒకరి తరువాత మరొకరు మృతి చెందుతున్న పరిస్థితుల్లో.. జిల్లాలోని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వీరావల్ లో చిక్కుకున్న తమ వారిని స్వస్థలాలకు రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: