శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు కొనసాగించాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. కొవిడ్ ప్రవర్తనా నియమావళికి సంబంధించిన కార్యక్రమాలను ఆయన వివరించారు. వాక్సిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని.. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనే అపోహలో ప్రజలు ఉండవద్దని కోరారు. సామూహికంగా సంక్రాంతి పండగ వేడుకలు నిర్వహించుకునే ముందు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రైతులకు పంటలు వచ్చే కాలమని, పంటల విక్రయ సమయంలోనూ.. ఇతర సమయాల్లోనూ జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ప్రాధాన్యతా క్రమంలో భాగంగా దేశ ప్రజలకు మూడవ దశలో టీకాను ఇవ్వనున్నట్టు కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
భాజపా - జనసేన ధర్మయాత్ర ఉద్రిక్తం... ఎక్కడికక్కడ నేతల అరెస్టులు