శ్రీకాకుళం జిల్లా పాలనాధికారి శ్రీనివాస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు పనులను పరిశీలించేందుకు పాలకొండ పట్టణంలో ఆయన పర్యటించారు. పెద్ద కాపు వీధి పాఠశాల పరిశుభ్రంగా లేకపోవడంతో ఆయనే స్వయంగా చెత్తను ఏరివేశారు. బడి ఫ్లోరింగ్ సక్రమంగా లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులు జామి రవిని హెచ్చరించారు. వన్పనీలమ్మ కాలనీలో సచివాలయాన్ని తనిఖీ చేసిన ఆయన, రికార్డుల వివరాలు ఆరాతీశారు.
ఇదీ చదవండి: