ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సెల్ఫోన్ వినియోగంపై నిషేధం ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధులతో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. లెక్కింపు కేంద్రంలో ఉండాల్సిన ఏజెంట్ల వివరాలు ఇంకా అందించని వారు ఉంటే తక్షణం అందించాలని కోరారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్ళు వేస్తున్నామన్నారు. లెక్కింపు గణాంకాల నమోదుకు రిటర్నింగు అధికారి వద్ద కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సాధారణ పరిశీలకులు ఒక లెక్కింపు గదిలో ఉంటారనీ... మిగిలిన గదులకు ఒక సూక్ష్మ పరిశీలకులకుడిని నియమించామని చెప్పారు. ఏజెంట్, ఫారం 18తో హాజరు కావాలన్నారు. సాధారణ ఏజెంటు ఉదయం వచ్చినప్పటి నుండి లెక్కింపు ముగిసే వరకు కొనసాగాలన్న కలెక్టర్... వారికి ప్రత్యామ్నాయ పరిశీలకుడిని పెట్టుకోడానికి వీలు లేదని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి..