శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కలెక్టర్ జె.నివాస్ పర్యటించారు. కరోనా కేసులు నమోదైన ఇచ్ఛాపురం పట్టణంలోని నీలకంఠేశ్వర వీధి కంటైన్మెంట్ జోన్‌ను ఆయన పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, వైద్య సిబ్బందితో మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్లో సుమారు 160 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి కలెక్టర్‌కు వివరించారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న వారందరికీ పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులతో అన్నారు.
ఇంటింటా సర్వే నిర్వహించి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. నమూనాల సేకరించి, పరీక్షల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్న ధైర్యంగా ముందుకు రావాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలందరికీ నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చదవండి : శ్రీసిటీపై కరోనా ఎఫెక్ట్... ఉత్పత్తి అంతంత మాత్రమే