ETV Bharat / state

"యమధర్మా.. వచ్చుచుంటిని.." ఫుల్లుగా తాగి నదిలో దూకేశాడు! - రామం

వైన్ షాపుకెళ్లాడు.. ఓ నైంటీ వేశాడు. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు గుర్తొచ్చాయి.. ఇంకో నైంటీ వేశాడు. ఇంట్లో గొడవలు యాదికొచ్చాయి.. అంతే.. నైంటీలతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుకున్నాడు. ఎంత పుచ్చుకున్నాడో తెలియదుగానీ.. బండి ఫుల్లుగా లోడైంది. అప్పుడు అతనిలోని "అపరిచితుడు" బయటికొచ్చాడు.. "బ్రిడ్జీ పైకెక్కి నదిలోకి దూకేయ్" అని ఆదేశించాడు. అమాయకపు "రామం" అదే పనిచేశాడు!!

task
task
author img

By

Published : Sep 23, 2022, 5:02 PM IST

కష్టాలను మరిచిపోవడానికి ఒక్కొకరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. మెజారిటీ మగాళ్లు మాత్రం సాయంత్రం వేళ "గుడికెళ్లి" భజన చేసి వస్తుంటారు. కనకదుర్గ బార్.. భద్రకాళి వైన్స్.. విజయదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ అంటూ.. అమ్మవార్ల పేరుతో ఉండే "ఇస్పెషల్ ఆలయాల్లో"కి వెళ్లి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి.. కష్టాలు ఏకరువు పెట్టుకొని.. భారంగా నిట్టూర్చి.. ఇంటిబాట పడుతుంటారు.

ఇప్పుడు మన స్టోరీలోని అమాయకపు "రామం" కూడా అలాగే వెళ్లాడు. బాధలు రోజూవారి కంటే ఎక్కువయ్యాయో ఏమో.. "అంతకు మించి" అన్నట్టుగా.. రోజూ కంటే ఎక్కువే తాగాడు. ఓవర్ డోస్ కావడంతో.. తనలోని "అపరిచితుడు" బయటకు వచ్చేశాడు. అతనితో ఫ్యామిలీ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం మొదలు పెట్టాడు.

"ఏటీ.. ఎదవ జీవితం.. ఓ సుఖం లేదు.. సంతోషం లేదు.. ఇంట్లో గౌరవం లేదు.. నా బతుకు నీటికంటే పల్చన.. దూదికంటే చుల్కన అయిపోయే! ఇంక బతికి నానేటి చేసేది?" అన్నాడు రామం.. రోజూ చెప్పే పనికిమాలిన సోదే కదా అని లైట్ తీస్కున్నాడు అపరిచితుడు. కానీ.. "ఇవాళ నాకు ఏదో ఒక పరిష్కారం చూపాల్సిందే" అన్నాడు రామం. అప్పటి వరకూ "వదిలి పెట్టేదే ల్యా" అన్నాడు.

దానికి అపరిచితుడు ఇలా బోధించాడు.. "పిచ్చి రామం.. మనిషన్నవాడికి సుఖం ఎక్కడుంది నాయనా..? జీవితాంతం కష్టాలతో సహవాసం చేయాల్సిందే. చచ్చేదాకా.. చస్తూ బతకాల్సిందే! ఇక నావల్ల కాదు..రెస్ట్ తీసుకుంటా అంటే.. రెస్ట్ ఇన్ పీస్ అయిపోవడం ఒక్కటే మార్గం నాయనా! నా మాట విని వెళ్లి ఆ నాగావళి వంతెన ఉంది చూశావ్.. దాని పైకెక్కి కిందకు దూకెయ్.. ప్రాబ్లమ్ సాల్వ్డ్ " అని ఉపదేశించాడు.

అపరిచితుడికి థ్యాంక్స్ చెప్పిన "రామం".. "మీరు వెళ్లండి నేను వెళ్లి దూకేస్తాను" అన్నాడు. "ఫర్వాలేదు నాయనా.. నాకేమైనా పనీపాటా ఉందా ఏంటీ? నిన్ను సాగనంపిన తర్వాతే నేను వెళ్తాలే" అన్నాడు. ఇద్దరూ కలిసి శ్రీకాకుళంలోని డే అండ్‌ నైట్‌ కూడలి సమీపంలోని.. నాగావళి వంతెన మీదకు చేరుకున్నాడు. వంతెన రెయిలింగ్ పైకెక్కి ఏదో ఆలోచిస్తున్నాడు "రామం". "చించింది చాలుగానీ.. ఇక పో.. ఎంతసేపు వెయిటింగ్?" అన్నాడు అపరిచితుడు. అతన్నుంచి.. ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాడు "రామం".

సీన్ కత్తిరిస్తే.. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. అతను దూకిన చోట లోతు తక్కువగా ఉంది. చచ్చిపోలేదు.. బతికిపోయాడు..! నీళ్లలో పూర్తిగా తడిసిపోవడంతో.. మత్తు వదిలిపోయింది. "ఓ షిట్.. ఏంటీ దారుణం..? ఆ.. "అప్రతిష్టుడి" మాటలు విని నన్ను నేనే చంపుకోవడానికి సిద్ధమయ్యానా? ఇలా జరగడానికి వీల్లేదు." అని బయట పడేందుకు ప్రయత్నించాడు. కానీ.. చుట్టూ నీళ్లే. ఎలా బయటకు రావాలో తెలియలేదు. కాస్తంత దూరంలో.. ఓ ఆధారం కనిపించింది. వరదల్లో కొట్టుకొచ్చిన చెత్త, చెట్లు.. ఒక దగ్గర చిక్కుకుపోయాయి. అక్కడికి వెళ్లి ఆ చెత్త పెకెక్కి.. శేష పాన్పు మాదిరిగా ఫీలవుతూ.. ఇలా పవలించాడు.

తెల్లవారిన తర్వాత.. ఈ వింత చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. చుట్టూ నీళ్లుంటే ఇతగాడు అక్కడికెలా వెళ్లాడు? ఎందుకెళ్లాడు? అసలు దానిపై ఎందుకు పడుకున్నాడు? అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. రక్షకభటులు రంగంలోకి దిగారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. నదిలోకి దిగి.. నీళ్లను దాటుకొని.. అతని వద్దకు వెళ్లారు. "ఓ బాబూ.. పొద్దెక్కింది లెవ్.." అన్నారు. "అప్పుడే తెల్లారిందా..?" అంటూ ఆవలిస్తూ నిద్రలేచాడు.. శ్రీకాకుళం దండి వీధికి చెందిన భరత్‌ కుమార్‌. ఈ స్టోరీలో కథానాయకుడు ఇతనే!

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.