లోక కల్యాణార్థం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో 12 రోజుల పాటు నిర్వహించే శ్రీ పంచాయతన సూర్యారాధన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. రోజూ ఉదయం శ్రీ సూర్య పంచాయతన అభిషేకం, మహాసౌర అరుణ పూర్వక సూర్య నమస్కారాలు, మహా శాంతి పాఠ పారాయణ, సహస్రనామార్చన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేద పండితులు జోస్యుల సుందర వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో ఈ మహా యాగం నిరాడంబరంగా జరుగుతోంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ క్రతువును నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: