శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి లో రాయితీ ఎరువుల పంపిణీ కార్యాక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం ఇటీవలి వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన , నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులెవ్వరు అధైర్య పడొద్దని పేర్కొన్నారు. సిఎం జగన్మోహన్రెడ్డి ఇప్పటికే రైతులకు ఇచ్చే పరిహారం పై జిల్లా కలెక్టర్లతో మాట్లాడారనీ, ముంపు ప్రాంతాల పంట నష్టం అంచనా వేసి నివేదిక అందించాలని ఆదేశించారని రైతులకు వివరించారు.
ఇదీ చదవండి : రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చే పరిస్థితి లేదు: కన్నా