జగనన్న పాలనలోనే పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో రేషన్ పంపిణీ ప్రత్యేక వాహనాలను మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి కృష్ణదాస్ ప్రారంభించారు. ప్రజా సంకల్ప యాత్రలో సేకరించిన సమస్యల పరిష్కార దిశగా పాలనను అందిస్తున్నామన్న కృష్ణదాస్.. నిరుపేదలు, రైతులు, కూలీలు, మహిళల అవసరాలను, కష్టాలను తెలుకుని సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. దానికోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. వాహనాల ద్వారా రేషన్ సరకులు ఇంటి ముంగిటకే అందిస్తామన్నారు. ఫిబ్రవరి 1నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతాయని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 530 వాహనాలతో నగరంలోని ప్రధాన రహదారిలో ర్యాలీ చేశారు.
ఇదీ చదవండి: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ బాబు గృహ నిర్భంధం