ETV Bharat / state

Kalipatnam Rama Rao: కథా సాహిత్య దీపధారి - కాళీపట్నం రామారావు న్యూస్

జీవితంలో సమస్యలను, ఆ సమస్యలకు కారణాలను తెలియజేసేది మంచి కథ.

Kalipatnam Rama Rao
కాళీపట్నం రామారావు
author img

By

Published : Jun 5, 2021, 7:37 AM IST

ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ కథకుడు. గడచిన వందేళ్ల ఉత్తమ తెలుగు సాహిత్యంలో ఆయన కథలు తప్పనిసరిగా ఉంటాయి. వర్తమాన సాహితీ ప్రపంచానికి ఆయన 'కారా' మాస్టారు. ఈ తరం కథకులకు దీపధారి- కాళీపట్నం రామారావు.

కాళీపట్నం 1924 నవంబరు తొమ్మిదో తేదీన శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామంలో జన్మించారు. వారి స్వస్థలం మురపాక గ్రామం. గణిత ఉపాధ్యాయుడిగా మూడు దశాబ్దాలకు పైగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. విద్యారంగంలోనైనా, సాహితీ సీమలోనైనా 'కారా' వారిదెప్పుడూ గురుస్థానమే. మధ్య తరగతిలో జీవించినా అట్టడుగు వర్గాల ప్రజలపై అభిమానం, ఆపేక్ష పెంచుకొని వారి కష్టాలను, కన్నీళ్లను కథనం చేసి కథారచనలో కొత్తశకం సృష్టించారు.

కథా'యజ్ఞం'

కాళీపట్నం తొలి కథ 1943 సెప్టెంబర్‌లో 'చిత్రగుప్త' కార్డు కథలు శీర్షికతో ప్రచురితమైన ‘ప్లాటుఫారమో’. తొలిదశలో 1948-55 మధ్య కుటుంబ సంబంధాలు ఇతివృత్తాలుగా 'పెంపకపు మమకారం, అశిక్ష-అవిద్య' తదితర కథలు రాశారు. 1955 తరవాత సాహిత్యం గురించి ‘కారా’ అభిప్రాయాలు మారడం ప్రారంభమైంది. ఆ అభిప్రాయాలకు ఒక స్వరూపం ఏర్పడేవరకు 1956-63 మధ్య ఆయన రచయితగా మౌనం వహించారు. కుటుంబ సంబంధాల నుంచి సామాజిక పీడనకు, మధ్యతరగతి నుంచి పీడించే పైతరగతికి, పీడితులైన కింది తరగతికి దృష్టి మారిన తరవాత మళ్ళీ రచనలు చేశారు. ఈ దశలోనే 'యజ్ఞం, తీర్పు, కుట్ర, భయం, జీవధార, చావు, ఆర్తి, హింస’ వంటి కథలు వెలువడ్డాయి. 1972-92 మధ్య మళ్ళీ రచనలు చేయని 'కారా' 92లో 'సంకల్పం' రాశారు. మొత్తం 60 కథలు రచించారు. రావిశాస్త్రి స్నేహంవల్ల మాస్టారి సామాజిక దృక్పథంతో పాటు సాహిత్య దృక్పథంలోనూ మార్పులు వచ్చాయి. రచయితకు ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలనే అభిప్రాయం ఏర్పడింది. కొడవటిగంటి కథలు తనను ఆకట్టుకున్నాయని కథారచనలో ఆయన విధానాన్ని అనుసరించానని అనేక సందర్భాల్లో 'కారా' పేర్కొన్నారు. కొంతకాలం విప్లవ రచయితల సంఘంలో సభ్యులుగా ఉన్నారు. మాస్టారి కథల ఇతివృత్తాలు చాలావరకు గ్రామీణ నేపథ్యం నుంచి పుట్టినవే. ఆయన తొలికథల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని పీడనను గురించిన అవగాహన కనిపిస్తుంది. ఆ దశలో కూడా 'కీర్తికాముడు' కథలో ద్రవ్య ఆర్థిక విధానం జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెప్పారు. 'అప్రజ్ఞాతం' కథలో రైతులు వ్యవసాయ కూలీలెలా అవుతున్నారో చిత్రించారు.

'కారా' అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది ‘యజ్ఞం’ కథ. బహుశా తెలుగులో ఈ కథపై జరిగినంత విపులమైన చర్చ మరే కథపైనా జరగలేదేమో! సోషలిస్టు తరహా వ్యవస్థ పేరుతో దేశంలో రూపొందుతున్న దోపిడి వ్యవస్థను పోషించడంలో నేతలు నయవంచనతో ప్రజాశక్తుల్ని వాడుకునే తీరును ఈ కథ బహిర్గతం చేయబోయిందని చాలామంది విమర్శకులు భావించారు. చాలామంది ‘సంకల్పం’ ఒక ప్రయోగంగా భావించారు. మానసిక చిత్రణకోణం నుంచి ఆ కథ రాశానని రచయిత పేర్కొన్నారు. కారా మాస్టారిది కొడవటిగంటిలా నిరాడంబరశైలి. ‘యజ్ఞం’లో తిరుగుబాటు గురించి చెప్పినా, ‘చావు’లో విప్లవాన్ని గురించి మాట్లాడినా కథావస్తువును మరొక అంశంమీద ఆరోపించి గోప్యంగా సూచన చేయడం ‘కారా’ పద్ధతి. ‘జీవధార’ నీటి సమస్య గురించిన కథలా కనిపించినా రకరకాల సామాజిక సంబంధాలను చిత్రించడానికి నీరు ఒక నెపం మాత్రమే. శ్రీకాకుళం భాషకు కాళీపట్నం సాహిత్య గౌరవం తెచ్చారు. ఆలంకారికతకు దూరంగా ఉండి క్లుప్తతకు, మాటను యథాతథంగా అక్షరబద్ధంచేసే వాక్య నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్తి, జీవధార, నోరూమ్‌, చావు- కథలు వేటికవే సాటి. సామాజిక వ్యవస్థను దర్శించి కథల్లో ఆవిష్కరించిన తీరు గొప్పది!

విలువలకు ప్రాధాన్యం

'యజ్ఞంతో తొమ్మిది' కథా సంకలనానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించినప్పుడు 'విరసం' సభ్యుడిగా 'కారా' దాన్ని తిరస్కరించారు. ఆ తరవాత కేంద్ర సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల వంటివి ఎన్నో అందుకున్నారు. ‘నేటికథ’, 'కథాకథనం' వ్యాసాలద్వారా వర్ధమాన రచయితలకు కథారచనలోని జీవలక్షణాలు నేర్పించారు. వ్యక్తిగా సౌజన్యమూర్తి. విమర్శల్ని సౌమ్యంగా స్వీకరించేవారు. శ్రీకాకుళంలో ఆయన 1997లో నెలకొల్పిన 'కథానిలయం' కథా పరిశోధకుల పాలిట కల్పవృక్షం. 'కథ కంచికి' అని సామెత. తెలుగు సాహిత్యంలోని వేలాది కథలకు ఆశ్రయమిచ్చిన 'కంచి'- కథానిలయం. ఒక ప్రక్రియకు సంబంధించిన మొత్తం సాహిత్యాన్ని ఒకచోట చేర్చడం అసాధారణమైన కృషి. సాహిత్యానికి దూరమైతే ఈ తరం మానవ విలువలకూ దూరమవుతుందని ‘కారా’ నమ్మేవారు. సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల మీద మంచి అవగాహన కలిగి, ఆ అవగాహనతో జీవితాన్ని చూసి, గ్రహించిన దాన్ని కళాత్మకంగా దర్శింపజేయగలవాడే మంచి రచయిత అని చెబుతుండేవారు. భౌతికంగా లేకపోయినా కథకులుగా ‘కారా’ కీర్తిశేషులు. ఆయన రచనలు అజరామరం!

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

సంబంధిత కథనం:

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.