శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో పర్యావరణ పరిరక్షణ అధికారులు నిర్వహించిన ర్యాలీలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భూమిపై పచ్చదనం లేకపోవడంతో వాతావరణం సమతౌల్యత దెబ్బతిని సకాలంలో వర్షాలు కురిసే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో లక్ష మొక్కలు నాటే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీచూడండి. చాకచక్యంతో యువతి ఆత్మహత్యను ఆపిన పోలీసులు