రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి... 50 శాతానికి పైగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని స్పీకర్.. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర మంత్రివర్గంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన తనకు స్పీకర్ పదవి ఇచ్చారన్నారు. అక్టోబరు 18ని....అణగారిన వర్గాల ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. 16 నెలల పాలనలో బీసీల కోసం రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
ఇదీ చదవండి: