శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురం గ్రామంలో మూడు లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్‌ను శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. అల్లిపల్లిగూడ గ్రామంలో గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
గిరిజనులు భూమిపై ఆధారపడతారని, వాళ్లకు రెండు ఎకరాల భూమిని కేటాయించి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. గిరిజనులను ఆదుకునే మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. జిల్లాలో 22,000 గిరిజన లబ్ధిదారులకు 32 వేల ఎకరాల పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు