శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొరగం, బొరగవలస గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు తమ గ్రామాల్లోనే అందాలనే ఉద్దేశంతో రైతుభరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి
ఎస్పీ బాలు మృతి కళా, సాంస్కృతిక రంగానికి తీరని లోటు: సీఎం జగన్