శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తాళ్లవలసలో అధికారులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. భారీ వర్షంలో కూడా ఆయన మెుక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటే కార్యక్రమంలో ఇటువంటి వర్షాలు కురవటం శుభప్రదమని అన్నారు. సుమారు గంట పాటు వర్షంలోనే మెుక్కలు నాటే కార్యక్రమంలో ఆయన భాగం పంచుకున్నారు.
ఇదీ చదవండి:
ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ