శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం పాలవలస, అల్లెన గ్రామాల్లో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల వద్దకే పాలన తీసుకురావడానికి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, నాడు-నేడు కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. గ్రామ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అనేక సేవలందించేందుకు ఎంతో వీలు పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా... గ్రామాల్లోనే తమ పనులు సులువుగా చేసుకునే విధంగా చర్యలు చేపట్టిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండీ... సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం.. కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు