శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని పురుషోత్తపురం వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఎస్పీ అమిత్ బర్దార్ ప్రారంభించారు. పూజలు నిర్వహించిన తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇసుక, మద్యం వంటి అక్రమ రవాణాలను అరికట్టేందుకు ఈ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర నేరాల కట్టడికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రతి వాహనాన్ని విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తారని ఎస్పీ చెప్పారు. దీనికి సంబంధించి రికార్డుల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వినోద్ బాబు, పట్టణ, రూరల్ ఎస్సైలు వి.సత్యనారాయణ, కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతులకు బేడీలు వేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసన