సోనూసూద్.. బహుశా ఈ పేరు తెలియని వారెవరూ ఉండరేమో. కొవిడ్ విలయతాండవం సృష్టిస్తున్న తరుణంలో.. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన చేస్తున్న సేవలకు శ్రీకాకుళం నగరానికి చెందిన యువకుడు లాల్ ప్రసాద్ ఫిదా అయ్యాడు. తన వంతుగా ఆయనకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. తన ప్రతిభను పణంగా పెట్టి.. ఆయన చిత్రాన్ని గీశాడు. అదేమీ చిన్నది కాదు.
ఆరడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో.. బొగ్గుతో యథాతథంగా గీసి సోనుసూద్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. సోనూసూద్ ఆహార్యాన్ని చిత్రంలో చక్కగా ఇమిడేలా చేసి ఔరా అనిపించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని సోనూసూద్ కి బహుకరిస్తానని చెబుతున్నారు. లాల్ ప్రసాద్ గతంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మహానటి సావిత్రి, కథానాయకుడు ప్రభాస్ చిత్రాల్ని గీసి శభాష్ అనిపించుకున్నారు.
ఇదీ చదవండి:
ఆక్సిజన్ కేటాయింపు, సరఫరా పెంచాలంటూ.. ప్రధానికి సీఎం జగన్ లేఖ