ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం.. ఐదుగురు ఒడిశా వాసుల మృతి - accidnents in srikakulam

శ్రీకాకుళం జిల్లా మందసలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కల్వర్టుని ఢీ కొని కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా భువనేశ్వర్​కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సింహాచలంలో స్వామివారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం.. కుటుంబంలో ఐదుగురు మృతి

author img

By

Published : Jan 4, 2020, 9:28 AM IST

Updated : Jan 4, 2020, 10:41 AM IST

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వంతెన వద్ద కల్వర్టుని ఢీకొన్న కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుణ్ని చికిత్స నిమిత్తం స్థానికులు సోంపేట ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒడిశాలోని భువనేశ్వర్​కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంలో దంపతులు ప్రతాప్​, రీతూ, డ్రైవింగ్​ చేస్తున్న ప్రతాప్​ బావమరిది, మరో కుటుంబానికిి చెందిన బనిత జన్నా, ఆదర్శకుమార్​ జన్నా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం నుంచి త్రిలోచన జన్నా స్వల్పగాయాలతో బయటపడ్డారు.

అప్పన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా

సింహాచలంలోని అప్పన్న దర్శనానికి ఒడిశాకు చెందిన రెండు కుటుంబాల వారు కారులో బయలు దేరారు. స్వామి దర్శనానంతరం తిరిగి ఒడిశాలోని బ్రహ్మపుత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగిది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కారును, మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో డోర్​ లాక్​ పడిపోవడం వల్ల బాధితులు తప్పించుకోలేకపోయారు.

ఇదీ చూడండి:

ఆన్​లైన్​​ వ్యభిచార ముఠా గుట్టు రట్టు... ఐదుగురు అరెస్ట్

Intro:Body:Conclusion:
Last Updated : Jan 4, 2020, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.