Srikakulam Shilparamam Development Works Stopped : రాష్ట్రానికైనా, దేశానికైనా ఆదాయం తెచ్చే వాటిల్లో పర్యాటక ప్రదేశాలు ముందు వరుసలో ఉంటాయి. అలాంటి ప్రదేశాలను పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది.. పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి. కానీ, ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్ల పర్యాటకులతో కళకళలాడాల్సిన ప్రదేశాలు.. అభివృద్ధి పనులు మందగించి కళాహీనంగా తయారవుతున్నాయి. ఇప్పటికీ పర్యాటక ప్రదేశంగా మారి కళకళలాడాల్సిన శ్రీకాకుళంలోని శిల్పారామం పరిస్థితి కళ తప్పింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు మూలనపడ్డాయి. బిల్లులు చెల్లించక శిల్పారామం పనులు ముందుకు సాగలేదు. దీంతో శిల్పారామం (Shilparamam) పరిస్థితి ఆదిలోనే హంసపాదులాగా మారింది.
శ్రీకాకుళం నగరాన్ని సాంస్కృతికంగా అభివృద్ధి పరిచేందుకు.. 2018లో టీడీపీ ప్రభుత్వం శిల్పారామం నిర్మాణ పనులు ప్రారంభించింది. పొన్నాడ కొండ వద్ద.. నగావళి నది ఒడ్డున.. 10 ఎకరాలు స్థలం కేటాయించింది. తొలి విడతగా 5కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన కొద్ది కాలానికే వైసీపీ అధికారంలోకి వచ్చింది. గుత్తేదారుకు బిల్లులు చెల్లింపులో వైసీపీ సర్కారు నిర్లక్ష్యం వహించింది. శిల్పారామం పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. నాలుగేళ్లు గడిచినా పనుల ప్రారంభంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వ తీరుపై నగర వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"బొర్రా గుహలు.. వసతులు కరవు"..
జిల్లాలో అరసవల్లి శ్రీకూర్మం, శ్రీముఖలింగం దేవాలయాలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. నగరంలో శిల్పారామం నిర్మించడం వల్ల ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. వందలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఇదే ప్రాంతంలో ఇస్కాన్ మందిరం (Iskcon Temple) అభివృద్ధి చెందుతోంది. మరోపక్క శిల్పారామం ఏర్పాటైతే ఆహ్లాదకరంగా గడిపేందుకు అనుకూలంగా ఉంటుందని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శిల్పారామం పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా మంత్రి ధర్మాన (Minister Dharmana) ప్రసాదరావును ప్రజలు వేడుకుంటున్నారు.
ఆర్కే బీచ్ రోడ్డు బోసిపోతుందా?!! చర్చనీయాంశంగా జీవో నెం 1పరిణామాలు
శ్రీకాకుళం పట్టణంలో ఆహ్లాదకరంగా గడపడానికి ఎలాంటి పార్కులు లేవు. గత ప్రభుత్వం నగావళి నది ఒడ్డున శిల్పారామనికి స్థలం కేటాయించింది. ఇదే ప్రాంతంలో ఇస్కాన్ మందిరం కూడా అభివృద్ధి చెందుతోంది. శిల్పారామం ఏర్పాటు చేస్తే బాగుంటుందని టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రారంభించింది. నిధులు కేటాయించి.. అభివృద్ధి పనులు మొదలు పెట్టింది. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత పనులు ఆగిపోయాయి. ప్రాజెక్టు కూడా పూర్తిగా ఆగిపోయింది. కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించకపోవటం వల్ల వారు పనులు చేయటం మానేశారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని పనులు మొదలు పెట్టి శిల్పారామన్ని అభివృద్ధి చేయాలని కోరతున్నాం. - స్థానికుడు
Tourist Places in Hyderabad : సరికొత్తగా ముస్తాబైన హైదరాబాద్.. వీటిని చూడటం అస్సలు మిస్సవ్వద్దు