ETV Bharat / state

ఏకగ్రీవాల బాటలో పలు పంచాయతీలు - ZPTC ELECTIONS

గ్రామ పెద్దలంతా కలిసి ఒప్పించారో.. లేక ఆ నేతలే ప్రజలందరినీ మెప్పించారో.. కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవు. ఆదివారం రాత్రి వరకు అందిన వివరాలిలా ఉన్నాయి...

ఏకగ్రీవాల బాటలో పలు పంచాయతీలు
ఏకగ్రీవాల బాటలో పలు పంచాయతీలు
author img

By

Published : Feb 1, 2021, 7:49 PM IST

చీమలాపల్లిలో నామినేషన్‌ వేస్తున్న తెదేపా బలపరిచిన అభ్యర్థి

విశాఖ జిల్లా చోడవరం తిమ్మన్నపాలెం పంచాయతీ సర్పంచిగా గొర్లె రాము ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. ఈయన ఉన్నత విద్యావంతుడు. సర్పంచి పదవికి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. వైకాపాకు చెందిన రాము గ్రామాభివృద్ధికి రూ. మూడు లక్షలు తన వంతు విరాళంగా ఇచ్చేందుకు సమ్మతిని తెలిపారు. ఎనిమిది వార్డులుండగా తెదేపా, వైకాపా నాయకులు తలో నాలుగు వార్డులను పంచుకున్నారు. ఉప సర్పంచి పదవిని తెదేపాకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.

బుచ్చెయ్యపేట ; కె.పి.అగ్రహారంలో వైకాపా మద్దతుదారుడు గోపిశెట్టి శ్రీనివాసరావు, చినమదీనా సర్పంచిగా వైకాపాకి చెందిన పచ్చికూర మంగవేణి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. చినమదీనాలో ఎనిమిది వార్డులు ఉండగా అయిదు వైకాపా, మూడు తెదేపా మద్దతుదారుల చేత నామినేషన్లు వేయించారు.

కశింకోట: గురువుభీమవరం పంచాయతీ ఏకగ్రీవం చేయడానికి గ్రామపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. సర్పంచిగా హనుమంతు వెంకట లక్ష్మణరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి నిర్ణయించారు. గ్రామాభివృద్ధికి తమ సొంత నిధులు రూ.8 లక్షలు వెచ్చిస్తానని హామీ ఇవ్వడంతో ఏకగ్రీవం చేశారు. వైకాపా నుంచి నలుగురు, తెదేపా, జనసేన నుంచి ముగ్గురు చొప్పున వార్డులకు నామినేషన్లు వేశారు. దీనిని అధికారికంగా ప్రకటించవలసి ఉంది.

మాడుగుల గ్రామీణం: ఒమ్మలి గ్రామ పంచాయతీ నుంచి ఎం.కృష్ణాపురం నూతనంగా పంచాయతీ ఏర్పాటైంది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఎనిమిది వార్డుల్లో తెదేపా నాలుగు, వైకాపా నాలుగు మద్దతుదారులు, సర్పంచి పదవికి వైకాపా మద్దతుతో మొల్లి రాజ్యలక్ష్మి నామినేషన్‌ మాత్రమే వేశారు.

చీడికాడ : జె.బి.పురం, పెదగోగాడ పంచాయతీలో సర్పంచి, వార్డు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.

కె.కోటపాడు : కె.సంతపాలెం సర్పంచి పదవి ఏకగ్రీవం కానుంది. సర్పంచి పదవితో పాటు 10 వార్డు సభ్యులకు ఒక్కొక్కటే నామినేషన్లు దాఖలయ్యాయి. వైకాపా మద్దతుతో చల్లా మంగ ఒక్కరే సర్పంచి అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

అచ్యుతాపురం: మండలంలో నునపర్తి, వైఎస్‌ఆర్‌.నగర్‌, ఉప్పవరం, చిప్పాడ, హరిపాలెం పంచాయతీలకు ఒక్కొక్క నామినేషనే వచ్చాయి. చీమలాపల్లి, చోడపల్లి గ్రామాల్లో తెదేపా బలపరిచిన అభ్యర్థుల నామినేషన్‌ దాఖలుకు ప్రక్రియలో భారీగా ప్రజలు, తెదేపా అభిమానులు పాల్గొన్నారు.

విందు.. పసందు

ఏకగ్రీవాల బాటలో పలు పంచాయతీలు
ఏకగ్రీవాల బాటలో పలు పంచాయతీలు

నామినేషన్‌ కార్యక్రమాలకు హాజరైన మద్దతుదారులకు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు భోజనాలు ఏర్పాటు చేశారు. మారేడిపూడి, బవులువాడ, కొండుపాలెం, శంకరం, చింతనిప్పుల అగ్రహారం పంచాయతీల పరిధిలో మాంసాహారంతో విందు ఇచ్చారు. గ్రామాల నుంచి జనాన్ని ఆటోల్లో తీసుకువచ్చారు. మారేడిపూడి సర్పంచి అభ్యర్థి ఇచ్చిన విందు ఆరగిస్తున్న మద్దతుదారుల చిత్రమిది.

ఇవీ చదవండి

పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు: డీజీపీ సవాంగ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.