శ్రీకాకుళం జిల్లాలో రెండో డోసు టీకా ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కేంద్రాల వారీగా రెండో డోసు వ్యాక్సినేషన్ కు అర్హులైన వారి జాబితాను ముందుగానే సిద్ధం చేసి.. వారి చరవాణికి సంక్షిప్త సందేశాలు పంపించారు. ఏ కేంద్రానికి వెళ్ళాలి తదితర వివరాలు లబ్ధిదారులకు తెలియజేస్తున్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రం సిబ్బందికి ఆ సందేశం చూపిస్తే టీకా ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 94 కేంద్రాల్లో కోవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ వేస్తున్నారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సంవత్సరాల వయస్సు దాటిన సాధారణ ప్రజానీకానికి రెండో డోసు వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వ్యక్తులే వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని వారు కోరారు.
ఇవీ చూడండి: