శ్రీకాకుళం జిల్లాలో వరి పంట తర్వాత అత్యధికంగా మొక్కజొన్న పంట రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ మొక్కజొన్న పంటను 14వేల 500 హెక్టార్లలో సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి కంకులను కత్తెర పురుగులు తినేస్తోంది. ఇది చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పురుగు కాటుతో దిగుబడులు తగ్గిపోతాయని వాపోతున్నారు. జిల్లాలో సుమారు 5 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని..నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:వినూత్న రీతిలో కలుపు మొక్కల పనిబట్టాడు