శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ప్రధాన కూడలి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. లావేరు మండలం గుమ్మడాం గ్రామానికి చెందిన దంపతులు అన్నారావు, గాయత్రిలు రేషన్ కార్డు కోసం ఫోటోలు తీసుకొనేందుకు రణస్థలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతుండగా వీరిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భర్త అన్నారావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లైన ఏడాదికే గాయత్రి భర్తను కోల్పోవడంపై ఇరు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రణస్థలం ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
ఇవీ చూడండి...