శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం తామరపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో... ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని తండెంవలస గ్రామానికి చెందిన కుంచాల నీలం...మేఘవరం గ్రామంలో భజన ముగించుకొని తన ద్విచక్రవాహనంపై వస్తూ... తామరపల్లి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి వరకూ బాగానే ఉన్న నీలం... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: జీడి కర్మాగారంలో పేలిన బాయిలర్... తప్పిన ప్రమాదం