శ్రీకాకుళం జిల్లాలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక ఉల్లి పక్కదారి పడుతోంది. కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడంపై వినియోగదారులు మండిపడతున్నారు. బయట మార్కెట్లో ఉల్లి ధర వంద పలుకుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల వద్దే ఉల్లి సరకు నిల్వ ఉండటంతో వారే ఉల్లి ధరలు వారే నిర్ణయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించిన చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి