సాగు నీరు అందకపోవడంతో వరి పంట పొలాలు ఎండిపోవడంతో పంటను పశువులకు మేతగా పొలాల్లోనే వదిలేశారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం పలు గ్రామాల్లోని మడ్డువలస పిల్ల కాలువ ద్వారా సంతకవిటి మండలంలోని వాల్తేరు, పనస పేట, జి.ఎం పురం, శివకుల పేట తదితర గ్రామాలకు సాగు నీరు అందుతుంది. ఈసారి సకాలంలో వర్షాలు పడక, వరి పంటకు సాగునీరు అందలేదు. దీంతో పొలాల్లోనే వరి పంటను పశువులకు మేతగా విడిచిపెట్టారు.
మడ్డువలస పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...