శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం ఈత మానుగూడలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మత ప్రార్ధనలు నిర్వహించారు. కొంత మంది మత పెద్దలు.. పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రార్థనలు చేస్తున్న తీరుపై.. అధికారులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రార్ధనలు నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: