శ్రీకాకుళంలో అరుదైన పాము కలకలం - శ్రీకాకుళం నేటి వార్తలు
శ్రీకాకుళం చిన్న మండలవీధిలో అరుదైన పాము ప్రత్యక్షమైంది. జనావాసాల్లోకి వచ్చిన సర్పం... అక్కడే ఉన్న స్కూటర్లోకి దూరింది. విషయం తెలుసుకున్న గ్రీన్ మెర్సీ సంస్థకు చెందిన రమణమూర్తి.. చాకచక్యంగా పామును పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.