ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైభవంగా జరుగుతున్నాయి. పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 95వ జాతర మహోత్సవం సందర్భంగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు ఒడిశా, తెలంగాణతోపాటు ఉత్తరాంధ్రలో పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. మూడు రోజుల పాటు జరిగే ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారినికి మొక్కులు చెల్లించుకుంటారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మ నరేంద్ర స్వామి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఇవీ చూడండి...