శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గొదలాం గ్రామంలో తమ భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. తమ పూర్వీకులు కొనుగోలు చేసిన భూములను 50 ఏళ్లుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నామని, ఇన్నేళ్ల తరువాత భూములు తమవంటూ ఓ గుత్తేదారు దస్త్రాలు చూపిస్తూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆందోళనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమీపంలో భావనపాడు పోర్టు వస్తున్న నేపథ్యంలో భూముల ధరలు పెరిగి ఆక్రమణలు ఊపందుకుంటున్నాయని,.. పోలీసులు సైతం వారికే మద్దతు పలుకుతున్నారని రైతన్నలు ఆరోపించారు. తమ 13 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని వారు వాపోయారు. పొలాల్లో మట్టి తవ్వి గట్లు వేయడంతో రైతులు సాగు చేసుకుంటున్న పలు పంటలు ద్వంసం అయ్యాయి. తమ ప్రాణాలు పోయినా భూములు వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇదీచదవండి.