ఏడేళ్ల తర్వాత పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల వేడి మొదలయ్యింది. జిల్లాలోని 38 మండలాల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 11 వందల 64 గ్రామ పంచాయతీల్లోని పది వేల 9 వందల 24 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 18 లక్షల 48 వేల 4 వందల 19 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 11 వేల 41 పోలింగు కేంద్రాల్లో 14 వేల 83 మంది పోలింగు అధికారులతో పాటు 25 వేల 124 మంది పోలింగు సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు.
తొలి విడతలో...
జిల్లాలో మొదటి విడతలో మూడు నియోజకవర్గాల్లోని పది మండలాల్లోని 3 వందల 19 పంచాయతీలతో పాటు 2 వేల 9 వందల 2 వార్డులల్లో ఎన్నికలు జరగనున్నాయి. లావేరు, టెక్కలి, కొటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 4లక్షల 80 వేల 108 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2 వేల 9 వందల 40 పోలింగు కేంద్రాల్లో పోలింగు జరగనుంది.ఈ మొదటి విడతలో 3 వేల 6 వందల 66 మంది పోలింగ్ అధికారులతో పాటు 6 వేల 6 వందల 6 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికలలో పాల్గొంటారు.
రెండో విడతలో..
అలాగే రెండో విడతలో కూడా మూడు నియోజకవర్గాలలోని పది మండలాల పరిధిలోని 2 వందల 78 పంచాయితీలతో పాటు 2 వేల 7 వందల 16 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇచ్ఛాపురం, పలాస, రాజాం నియోజకవర్గాలల్లోని ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, రాజాం, సంతకవిటి, వంగర మండలాలల్లో రెండవ విడత ఎన్నికలు జరగనున్నాయి. 5 లక్షల 5 వేల 7 వందల 50 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.వీరికి 2 వేల 7 వందల 34 పోలింగు కేంద్రాల్లో పోలింగు జరగనుంది. అలాగే 3 వేల 7 వందల 12 మంది పోలింగ్ అధికారులతో పాటు 6 వేల 4వందల 46 మంది పోలింగ్ సిబ్బంది రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో విధుల నిర్వహిస్తారు.
మూడో విడతలో..
అలాగే మూడో విడతలో ఆమదాలవలస, పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలలోని 2 వందల 93 పంచాయితీలతో పాటు 2 వేల 6 వందల 48 వార్డులల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని, రేగిడి, ఆమదాలవలస మండలాల్లో మూడవ విడత ఎన్నికల నిర్వహిస్తారు. 3 లక్షల 77 వేల 8 వందల 67 మంది ఓటర్లు తమ ఓటు హక్కును మూడవ విడత ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. వీరికి 2 వేల 6 వందల 71 పోలింగు కేంద్రాలలో పోలింగు జరగనుంది. అలాగే 3 వేల 31 మంది పోలింగ్ అధికారులతో పాటు 5 వేల 7 వందల 2 మంది పోలింగ్ సిబ్బంది మూడవ విడత పంచాయితీ ఎన్నికలలో పాల్గొంటారు.
నాల్గో విడతలో..
ఇక నాల్లో విడతలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలలోని 2 వందల 74 పంచాయితీలతో పాటు 2 వేల 6 వందల 58 వార్డులల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, శ్రీకాకుళం, గార, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి మండలాలలోని 4 లక్షల 84 వేల 6 వందల 94 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరు 2 వేల 6 వందల 96 పోలింగు కేంద్రాల్లో పోలింగు జరగనుంది. అలాగే 3 వేల 6 వందల 74 మంది పోలింగ్ అధికారులతో పాటు 6 వేల 3 వందల 70 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికలలో పాల్గొంటారు.
పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్
జిల్లాలో ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటునట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. అలాగే ఎస్పీ అమిత్ బర్దార్ ఎన్నికలకు సంబంధించిన బందోబస్తు ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు. జిల్లాలో 11 వందల 90 పంచాయతీలు ఉండగా.. 11 వందల 64 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. వివిధ కారణాలతో 26 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు.
ఇదీ చదవండి: