ETV Bharat / state

TDP RALLY: అమదాలవలసలో తెదేపా నేతల అరెస్ట్​.. విడుదల​ - తెదేపా ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

శ్రీకాకుళం ఆమదాలవలసలో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ధరల పెరుగుదలకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడుతో సహా పలువురిని అరెస్టు చేసిన పోలీసులు.. అనంతరం విడుదల చేశారు.

తెదేపా నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Sep 9, 2021, 3:22 PM IST

నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్.. ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్​ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ధరల పెరుగుదలపై నిరసన తెలుపుతుంటే తమను అడ్డుకోవడం ఏంటని పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. అరెస్టు చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని పీఎస్​ వద్ద ఆందోళన చేపట్టారు.

నేతలు విడుదల..

ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్.. ఆమదాలవలస పీఎస్​ నుంచి బయటకొచ్చారు. ఆమదాలవలసలో అరెస్టు చేసిన ఎంపీ రామ్మోహన్‌, కూన రవికుమార్​.. విడుదలయ్యారు. ఇరువురికి కొవిడ్‌ ఆంక్షల ఉల్లంఘన కింద నోటీసు ఇచ్చి విడుదల చేశారు.

ఇదీ చదవండి..

lokesh narsaraopeta tour: లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.