ETV Bharat / state

50 పురాతన నాణేల స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

పురాతన నాణేలను దొంగతనం చేస్తున్న ఇద్దరు ఒడిశా దొంగలను అరెస్టు చేసినట్లు.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 50 పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ancient coins
పురాతన నాణేల స్వాధీనం
author img

By

Published : Jan 30, 2021, 8:42 AM IST

శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని కోమనపల్లిలో కాశీవిశ్వేశ్వర ఆలయం ఘటనలో.. ఇద్దరు ఒడిశా దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ అమిత్‌బర్దార్‌ వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. హిరమండలం కొమనాపల్లి గ్రామ శివారులో కొందరు గుర్తుతెలియని నేరస్థులు కాశీవిశ్వేశ్వర ఆలయానికి చెందిన గాలి గోపురానికి రంధ్రం చేసి దొంగతనానికి పాల్పడ్డారన్నారు.

అదే సమయంలో వారివద్దనున్న పురాతన నాణేలు పడిపోయాయనీ... ఈ ఘటనపై హిరమండలం పోలీసుస్టేషన్‌లో గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాలకొండ డీఎస్పీ శ్రావణి పర్యవేక్షణలో ఎస్‌ఐ మధుసూదనరావు సిబ్బందితో ముమ్మరంగా దర్యాప్తు చేశారన్నారు. వాటి ఆధారంగా ఒడిశాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. వారి వద్ద నుంచి 50 పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

అమాయక ప్రజలను మాయచేసి, మోసం చేయాలనే ఉద్దేశంతో పురాతన నాణేలను సేకరించి, మహిమ గల, శక్తివంతమైన నాణేలని ప్రజలను నమ్మపలికి ఎక్కువ ధరకు అమ్మి ప్రజలను మోసం చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ మధుసూదనరావు, కానిస్టేబుల్‌ ఎం.జోగారావు, హోంగార్డు బి.రమేష్‌కు నగదు పురస్కారాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికల శిక్షణకు అధికారుల గైర్హాజరు.. నోటీసులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.