శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైకాపా బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, దాడికి ప్రయత్నించారని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో 22 మందిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ ఘటన జనవరి 31న జరగ్గా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును ఏ3గా పేర్కొంటూ... ఈనెల 2వ తేదీన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గత ఐదు రోజులుగా నిమ్మాడలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. అచ్చెన్నాయుడు నివాసం వద్ద, ఆయన సోదరుడు హరివర ప్రసాద్ ఇంటి వద్ద పోలీసులు పికెట్ కొనసాగిస్తున్నారు. గ్రామంలోకి వచ్చి, వెళ్లే వారిపై నిఘా పెట్టారు. దాడి జరిగినట్లు పేర్కొన్న నామినేషన్ కేంద్రం వద్ద సైతం పోలీసులు గస్తీ కాస్తున్నారు. గ్రామంలోని వసతిగృహంలో పోలీసులు, ప్రత్యేక బలగాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: