సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని..,తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం పోలీసులు ఇచ్చిన నోటీసులపై కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు హాజరైన ఆయన వివరణ ఇచ్చారు. ఘటనకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని హైకోర్టులో కేసు వేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే..నిందితులను పట్టుకోకుండా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీచదవండి