ETV Bharat / state

ఇచ్ఛాపురంలో రోడ్డుపై గుంతలు పూడ్చిన పోలీసులు - ఇచ్ఛాపురంలో రహదారిపై గుంతలు వార్తలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు సేవా గుణాన్ని చాటారు. వివిధ ప్రాంతాలలో ఉన్న పాడైన రోడ్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు.

Police  fill up  potholes on the road in Ichapuram
ఇచ్ఛాపురంలో రోడ్డుపై గుంతలు పూడ్చిన పోలీసులు
author img

By

Published : Nov 6, 2020, 2:52 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పోలీసులు.. ప్రజలకు అండగా ఉంటున్నారు. మునిసిపాలిటి పరిధిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారుల సమస్యలను తీర్చుతున్నారు. ధ్వంసమైన రహదారులకు తాత్కాలికంగా మరమ్మతులు చేసే సామాజిక బాధ్యతను తమ భుజాలకు ఎత్తుకున్నారు. ఇచ్ఛాపురం సీఐ ఎం వినోద్, ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతుల కార్యక్రమాలు ప్రారంభించారు.

రత్తకన్న రహదారి - రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద బాగా పాడైన మార్గాన్ని తమ సిబ్బందితో కలిసి మరమ్మతు చేశారు. రాళ్లు, గ్రావెల్, ఇతర సామగ్రి వినియోగించారు. ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చారు. బాహుదా వంతెన నుంచి పురుషోత్తపురం గ్రామం వరకు మరమ్మతు చేశారు. పోలీసుల సేవలను ప్రజలు కొనియాడుతున్నారు.

ఇదీ చూడండి:

చిన్నవయసులో పెద్ద కష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.