శ్రీకాకుళంలో తెదేపా నేత కూన రవికుమార్ ఇంటి వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించడం చర్చనీయాంశమైంది. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజు రాత్రి రవికుమార్ స్వగ్రామమైన పెనుబర్తిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గీయులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కూన రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు.. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. రవికుమార్ ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. పోలీసుల తీరుపై కూన రవికుమార్ సతీమణి ప్రమీల మండిపడ్డారు.
ఇదీ చదవండి: అక్కడ తొలికేసు..ఆయనను కించపరిచినందుకే!