భారతీయ జనతా పార్టీ తలపెట్టిన చలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భాజపా నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యనేతలను గృహ నిర్భంధం చేశారు. వీరఘట్టంలో రోడ్డుపై బైఠాయించిన నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించగా.. అక్కడ ధర్నా చేపట్టారు. మందసలో ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని పాలకొండ, సీతంపేట, గార, కోటబొమ్మాళితో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా భాజపా నాయకులు రామతీర్థం వెళ్లకుండా.. పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఉద్రిక్తంగా 'చలో రామతీర్థం'.. భాజపా, జనసేన నేతల గృహ నిర్బంధం