శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పట్టణ సీఐ వినోద్ బాబు తెలిపారు. అమీన్ సాహెబ్ పేట ప్రాంతంలోని వార్డుల్లో పోలీసు కవాతు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు.
అనంతపురంలో..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం పోలీసులు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాబాలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైనా.. అనుమాస్పద వ్యక్తులు తారసపడ్డ పోలీసులను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది?: సీపీఐ రామకృష్ణ