ETV Bharat / state

నేటి నుంచి రణస్థలం మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జనవరి 1 నుంచి ప్లాస్టిక్ నిషేధానికి అధికారులు నడుం బిగించారు. ప్లాస్టిక్​ నిషేధానికి మండల అధికారులతో పాటు మేమున్నాం అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గత కొద్ది రోజులుగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

plastic ban rally
నేటి నుంచి రణస్థలం మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం
author img

By

Published : Dec 31, 2019, 11:54 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జనవరి 1 నుంచి ప్లాస్టిక్ నిషేదానికి అధికారులు నడుం బిగించారు. ఎవరైనా ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని మండల అధికారులు దండోరా వేయించారు. గత కొద్ది రోజులుగా అధికారులతో పాటు మేమున్నాం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ప్లాస్టిక్​కు వ్యతిరేకంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలని మండల పంచాయతీ విస్తరణాధికారి ఎస్​.వసంత కుమారి తెలిపారు. మండల కేంద్రంలో అందరం కలిసికట్టుగా ప్లాస్టిక్ నిషేధానికి పనిచేస్తున్నామని.. మేమున్నాం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పి.సాయిరాం తెలిపారు.

ఇదీ చదవండి:

'ఉపకార వేతనాల కోసం విద్యార్థులు రోడ్డెక్కితే... లాఠీఛార్జ్​ చేయిస్తారా'

Intro:AP_SKLM_21_31_Plastic py_Samaram_AVBB_AP10139

నేటి నుంచి రణస్థలంలో ప్లాస్టిక్ నిషేధం
* వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో జనవరి 1, 2020 నుంచి ప్లాస్టిక్ నిషేధానికి నడుంబిగించారు. ఒకటో తేదీ నుంచి ఎవరు ప్లాస్టిక్ సంచులు గాని వివిధ రకాల ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులు వినియోగించినట్లు కనిపిస్తే రూ.5 వేలు జరిమానా విధించడం జరుగుతుందని మంగళవారం మండల కేంద్రంలో దండోరా వేయించారు. ప్లాస్టిక్ నిషేధానికి రణస్థలం మండలం అధికారులతోపాటు, మేమున్నాం స్వచ్ఛంద సంస్థ ప్లాస్టిక్ సంచులకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మండల పంచాయతీ విస్తరణాధికారి ఎస్.వసంత కుమారి తెలిపారు. ప్లాస్టిక్ వినియోగించినట్లు ఫిర్యాదులు వస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండల కేంద్రంలో అందరం కలిసికట్టుగా ప్లాస్టిక్ నిషేధానికి కలిసికట్టుగా పని చేస్తున్నామని మేమున్నాం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పి.సాయిరాం అన్నారు.

Body:ప్లాస్టిక్ నిషేధం

Conclusion:ప్లాస్టిక్ నిషేధం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.