ETV Bharat / state

పునరావాస ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ ఆందోళన - east godavari migrant workers conflict news

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం సమీపంలోని డోలపేట వద్ద ఉద్రిక్తత నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా వలస కూలీలను అధికారులు డోలపేటకు తీసుకొచ్చారు. వారికి స్థానిక ఉన్నత పాఠశాల వద్ద అధికారులు చేపట్టిన పునరావాస ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు.

పునరావాస ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ ఆందోళన

author img

By

Published : May 1, 2020, 5:47 PM IST

పునరావాస ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ ఆందోళన

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం సమీపంలోని డోలపేట వద్ద ఉద్రిక్తత నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుమారు 150 మంది వలస కూలీలు చిక్కుకున్నారు. వారికోసం డోలపేట ఉన్నత పాఠశాల వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. రావులపాలెం నుంచి 4 బస్సుల్లో కూలీలను డోలపేటకు తీసుకొచ్చారు. అయితే డోలపేటలో వారికి కల్పించిన పునరావాస ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచెలు వేసి బైఠాయించారు. సర్దిచెప్పేందుకు యత్నించిన పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ముళ్లకంచెను తొలగించి కూలీలను పునరావాస కేంద్రానికి తరలించేందుకు యత్నించడగా.. స్థానికులు ప్రతిఘటించారు. తీసుకొచ్చిన కూలీలను వెంటనే వారి స్వస్థలాలకు పంపాలంటూ డోలపేట వాసులు డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: క్వారంటైన్ కేంద్రంలో ఆహారం ఇవ్వడం లేదని బాధితుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.