శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పరిశీలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల పక్రియ పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఉండే విధంగా చూడాలన్నారు. తొలివిడతలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తొలి విడతలో భాగంగా శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలంలో పంచాయతీ ఎన్నికలకు వెంకటాపురం, పెద్దలింగాలవలస, పోతయ్యవలస, అప్పాపురం, లావేరు, అదపాక, గోవిందపురం, పంచాయతీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాలకు నాలుగో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని కొత్తూరు మండలంలో గునబద్ర, గునబడ్రా కాలనీలో రెండు పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పాతపట్నం మేజర్ పంచాయతీలో నాలుగో వార్డుకు సంబంధించి ఓ నామినేషన్ దాఖలైంది. అధికారులు స్థానిక పాఠశాలలో నామినేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల శిక్షణకు అధికారుల గైర్హాజరు.. నోటీసులు జారీ