ఏ వస్తువు కొన్నా 50శాతం రాయితీ అన్నాడు... సమయం లేదు స్పందించాలంటూ వినియోగదారులను తొందరపెట్టాడు. ఆశపడి అందరూ భారీగా వస్తువులను కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చారు. 29వ తేదీన ఆఫర్ ముగుస్తుంది.. అప్పుడొచ్చి వస్తువులు తీసుకెళ్లాలన్నాడు. షాపు దగ్గరకు వేల సంఖ్యలో అడ్వాన్స్ ఇచ్చినవాళ్లంతా వచ్చారు... కానీ సీన్ రివర్స్ అయింది. 2 కోట్ల రూపాయిలతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో ఈ ఘటన జరిగింది.
ఇదీ చూడండి నడి రోడ్డుపై విద్యార్థుల వీరంగం... సినీ ఫక్కీలో ఘర్షణ